MBNR: చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులద్వారా అధికవసూళ్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఆలయంలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రవి, సందీప్, రాజశేఖర్, నాని, తదితరులు పాల్గొన్నారు.