MNCL: కాసిపేట్ మండలం దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు మంగళవారం మళ్లీ వాయిదా పడింది. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వరమ్మ సెలవుపై ఉన్నారని అధికారులు కోర్టుకు వెల్లడించారు.సెలవు కారణం చూపుతూ ఎన్నికలపై కాలయాపన చేస్తున్నారని కార్మిక సంఘం నేతలు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులను మందలించిన జడ్జి తీర్పు ఎల్లుండికి వాయిదా వేశారు.