CTR: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్లో సరైన సదుపాయలు లేవని చెబుతూ.. ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించాలి కదా అని జడ్జి రాజమండ్రి జైలు అధికారికి సూచించారు.