KMM: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో మంగళవారం లబ్ధిదారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని చెప్పారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు.