VZM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సోమవారం మంగళపాలెం వచ్చిన విషయం విధితమే. కొత్తవలస పట్టణంలో ఎన్నో ఏళ్ల నుండి ప్రజల చిరకాల స్వప్నం రైతుబజార్ ఏర్పాటు చేయాలని గత జూన్ 24న విజయవాడలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంత్రికి వినతి పత్రం అందజేశారు. కానీ సభలో రైతుబజార్ ప్రస్తావన ఎమ్మెల్యే మంత్రి దృష్టిలో పెట్టక పోవడంపై ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.