ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువలోకి చేరిన కృష్ణా జలాలకు మంగళవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువలో కృష్ణ జలాలు చేరడంతో సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు ఉండవన్నారు. కాలువ కింద ఉన్న ప్రతి రైతు సాగునీరు వాడుకుని పంటలు సాగు చేసుకోవాలన్నారు.