GDWL: గద్వాలలోని అయిజ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపులో జరిగిన సిగరెట్ కాటన్ బాక్స్ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి నుంచి ₹15 లక్షల విలువైన సిగరెట్ కాటన్ బాక్సులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎకో వ్యానును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.