NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెక్కర బాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 30 మంది లబ్ధిదారులకు మధ్యాహ్నం ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేస్తారని పేర్కొన్నారు.