NLG: తిప్పర్తి మండలంలో VOAలు మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CITU జిల్లా కార్యదర్శి సలీం పాల్గొని మాట్లాడుతూ..ఐకేపీ VOAల సమస్యలు పరిష్కరించాలని, వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని , కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని సలీం పేర్కొన్నారు.