VKB: బంట్వారం మండలం నుర్ణంపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో స్థానికులకు ఆందోళన కలుగుతోంది. పశువులు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరే ప్రమాదం ఉండటంతో రైతులు భయపడుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని వారు కోరారు.