ADB: అంబేద్కర్ అభయ హస్తం, చేవెళ్ల డిక్లరేషన్ హామీని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ఈనెల 18న వరంగల్లో నిర్వహించనున్న దళిత మహాసభ కరపత్రాలను ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. మహాసభను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఉద్య మకారులకు స్థలం కేటాయించాలన్నారు.