GDWL: గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ పి. మంజుల తెలిపారు. ఒకేషనల్ విభాగం ఎంపీహెచ్డబ్ల్యూ (MPHW-F) ప్రథమ సంవత్సర ఫలితాల్లో డి. రాణి 500 మార్కులకు గాను 458 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా మార్కులు సాధించారని అన్నారు.