ADB: పట్టణంలోని కొమరం భీమ్ భవన్లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో జిల్లా నాయకులు సమావేశమై వీలిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 28 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.