MBNR: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలం రుద్ర సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. SI ఏజాజుద్దీన్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యానికి కాపాడుకోవాలి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.