BDK: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బీసీ గురుకుల కళాశాలల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.బ్యూలారాణి తెలిపారు. జిల్లాలోని 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈనెల12లోపు http://mjptbcadmissions.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 5బాలుర,6బాలికల గురుకుల కళాశాలలు ఉన్నాయని తెలిపారు.