SRCL: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గంభరావుపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వస్తున్న మోదీ రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పవద్దన్నారు. మిడ్ మానేర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమని మంత్రి తెలిపారు.