NZB: విద్యుత్ శాఖ సబ్-ఎంజినీర్ రవీందర్ క్రమంగా విద్యుత్ పునరుద్ధరణ పనులను గురువారం పరిశీలించారు. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా పెద్దవాల్గోట్, చిన్న వాల్గోట్, కొండూరు గ్రామాలలో విద్యుత్ వ్యవస్థకు ఎదురైన నష్టాన్ని సమీక్షించారు. పరిశీలన సందర్భంగా రవీందర్ సిబ్బందికి విద్యుత్ పునరుద్ధరణ పనులను త్వరగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.