ADB: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 17న ఇచ్చోడలోని వివేకానంద కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ నికినీ వర్మ విడుదల చేశారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు వయసు ఉండి.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఆసక్తి గల వారు తమ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు.