ఎన్టీఆర్: మహానాడు సమీపంలోని వరుణ్ మారుతి షోరూమ్‌లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షోరూమ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించిన అధికారులు, హెల్మెట్ ధరించినప్పుడు తప్పనిసరిగా క్లిప్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.