KMM: కామేపల్లి మండలం జాస్తిపల్లి బీసీ కాలనీలో ప్రజల తాగునీటి అవసరాల కోసం యునైట్ వన్ సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి హ్యాండ్ బోరును ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కె. ఎలీషా శ్రీనివాస్, రూతు, యునైట్ వన్ సేవ సొసైటీ ప్రెసిడెంట్ కె.నీల్ కుమార్, సెక్రటరీ కె. నిరంజన్, గ్రామ పెద్దలు దేవండ్ల రామకృష్ణ, ఆనందరావు, నాగయ్య, పాల్గొన్నారు