MLG: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP రవీందర్ తెలిపారు. సీసీటీవీ ఆధారంగా గుర్తించిన నిందితుల వద్ద నుంచి20.691 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు,జనవరిలో జరిగిన ఈ చోరీలో మొత్తం రూ. 2.40 లక్షల ఆస్తి అపహరణకు గురైందని వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.