NLG: మారుపాకలో ఐకేపీ ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.