KNR: కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.