నిర్మల్ పట్టణ ప్రధాన రహదారిపై పది రోజుల క్రితం కృంగిన రోడ్డు ఇప్పుడు మరింత వెడల్పుగా మారి ప్రమాదకరంగా తయారైంది. అధికారులు కేవలం ఒక కర్రను సూచికగా పెట్టి వదిలేయడంతో, స్థానికులు చెట్ల కొమ్మలు, రాళ్లతో గుంతను గుర్తించేలా ప్రయత్నిస్తున్నారు. వేలాది వాహనాలు తిరిగే ఈ దారిలో రాత్రివేళ వాహనదారులు గమనించకపోతే ప్రాణాపాయం పొంచి ఉంది. వారం దాటినా మరమ్మతులు లేవని ప్రజలు వాపోతున్నారు.