VKB: జనాభా గణనపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవాళ్టితో ముగిసింది. ఈ ముగింపు సభలో మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ వెంకటయ్య పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గణన ప్రక్రియలో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.