WGL: వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్లను వేధించిన ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై గురువారం మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. టీజీ ర్యాగింగ్ యాక్ట్–1997 కింద చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కళాశాల యాజమాన్యం సంబంధిత విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసింది.