NLG: నిడమానూరులో నిరుపేద కుటుంబాలకు భరోసాగా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసింది. మార్కెట్ ఛైర్మన్ సత్యం హాజరై 71 మంది లబ్ధిదారులకు రూ. 71,08,236 విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.