KMM: కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ప్రభుత్వం రూ. 200 కోట్ల రూపాయలతో నూతనంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణం పనులను మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.