JGL: జగిత్యాల జిల్లా విద్యాశాఖ, SCERT పాప్యులేషన్ ఎడ్యుకేషన్ సెల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో 8, 9వ తరగతి విద్యార్థుల కోసం జానపద నృత్య పోటీలను బుధవారం టీచర్స్ భవన్లో నిర్వహించారు. ఈ పోటీలలో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లి జెడ్పీహైస్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. డీఈవో రాము, తదితరులు పాల్గొన్నారు.