MBNR: సామాజిక మాధ్యమాలలో అనవసర పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమని ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ చారి అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఒకరికొకరు విమర్శించుకోవడం మూలంగా జర్నలిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అలాగే జర్నలిస్టులు వ్యక్తిగత దూషణలకు దిగవద్దన్నారు.