HYD: నగరంలో వాయు కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం చిత్రపురి కాలనీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 185గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం, కట్టెల పొయ్యిల వాడకమే దీనికి ప్రధాన కారణాలని అధికారులు గుర్తించారు. గాలి నాణ్యత క్షీణించడంతో శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.