JGL: జగిత్యాల పట్టణం విద్యానగర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26- 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో మార్చి 26 గురువారం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధన నిర్వహిస్తామన్నారు.