SRPT: మోతే మండలం మామిల్లగూడెం గ్రామ సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన కోటయ్య చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కోటయ్య మృతితో తుమ్మలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.