NLG: నల్గొండ పట్టణానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు జనాబ్ మొహమ్మద్ షహీరుద్దీన్ (షహీర్ భాయ్) కన్నుమూశారు. పది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. షహీరుద్దీన్ మృతి పట్ల సీపీఎం పార్టీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.