MLG: ఏటూరునాగారం మండలం కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ తెలిపారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు కొండాయి, 10 గంటలకు చిన్నబోయినపల్లిలో జరగనుంది. ప్రజలు తమ సమస్యలు, పథకాల విన్నపాలు సమర్పించాలని సూచించారు. అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.