BDK: ఫిల్టర్ బెడ్‌ను రిపేర్ చేసి నీటిపై నాచు లేకుండా చూడాలని సీపీఐ నాయకులు కోరారు. కొత్తగూడెం టౌన్ రామవరం ప్రజల నీటి ఎద్దడిని సింగరేణి యాజమాన్యం తీర్చాలని మాజీ కౌన్సిలర్లు కోరారు. ఆదివారం రామవరం సీపీఐ ప్రతినిధి బృందం ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. తక్షణమే రెండు పూటల మంచినీళ్లు అందించాలని, స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.