NGKL: చారకొండ మండలం శిరసనగండ్ల గ్రామంలో ఈనెల 27న నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆహ్వానించారు. హైదరాబాద్లోని స్వేరోస్ హెడ్ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కన్వీనర్ మల్లయ్య నేతృత్వంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గిద్ద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.