KMM: హైకోర్టు ఆదేశాల మేరకు వైరా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా బొర్రా రాజశేఖర్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గతంలో పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆయన పదవిని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.