KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పుస్తక పఠనం విశిష్టతను గ్రంథాలయ ఇన్ఛార్జ్ సంపత్ వివరించారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లోని పుస్తకాలను కూడా క్షుణ్ణంగా చదవాలని ప్రధానోపాధ్యాయులు సుభాష్ సూచించారు.