MHBD: మరిపెడ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ రామచంద్రా నాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రభుత్వ విప్ హాజరై మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.