NRML: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే పుకార్లతో వాహనదారులు భారీగా కొనుగోళ్లు చేయడంతో పట్టణంలోని అనేక బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి నుంచే కొన్ని బంకులు మూతపడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడా పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచాలని వాహనదారులు కోరుతున్నారు.