MBNR: జడ్చర్ల మండలం మల్లేబోయిన్పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.