WGL: రాష్ట్రంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రేపు వరంగల్లో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు వర్దన్నపేట మాజీ MLA ఆరూరి రమేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను గాలికి వదిలేసిందని, ధాన్యం కొనకుండా అన్నదాతలను ఇబ్బంది చేస్తున్నారన్నారని మండిపడ్డారు. BRS రైతు సదస్సుకు రైతులు భారీసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.