HYD: హైదరాబాదులో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. అటు పాఠశాలలు కూడా నేటి నుంచి ఒంటి పూట నడవనున్నాయి.