ASF: యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని MLA హరీష్ బాబు అన్నారు. మంగళవారం మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోనే 60,000 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ లక్ష్యం ఉండగా, ప్రభుత్వం కేవలం 1200 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సేకరించారన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మాని వడ్ల సేకరణ వేగవంతం చేయాలన్నారు.