WNP: నేటి నుంచి అమరచింత ముందు మండల రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు అమరచింత వ్యవసాయ అధికారి అరవింద్ తెలిపారు. జీలుగా విత్తనాలు క్వింటాలకు 16,350 కాగా ప్రభుత్వం 50% సబ్సిడీపై క్వింటాలు రూ. 8,175లకు మాత్రమే రైతులకు అందజేస్తుందని, 30 కేజీల బస్తా రూ. 2,453లకు లభిస్తుందన్నారు. కావాల్సిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకొని రావాలి.