RR: ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు ప్రవహిస్తోంది. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో షాద్‌నగర్ నుంచి అయ్యవారిపల్లి, తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం త్వరితగతిన వంతెన పనులు నిర్మిస్తే గ్రామాలకు ఊరట లభిస్తుందని గ్రామస్తులు కోరుతున్నారు.