PPM: సమాజంలో సమాచార హక్కు చట్టం బలమైందని జిల్లా సూక్ష్మనీటి పారుదల అధికారి వి.రాధా కృష్ణ అన్నారు. సూక్ష్మనీటి పారుదల ప్రాజెక్టు, ఉద్యానవన శాఖ సిబ్బందికి ఉద్యాన శాఖ కార్యాలయంలో బుధవారం సమాచార హక్కు చట్టం- 2005 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి పౌరుడికి ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కు ఉందన్నారు.