KMM: నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన బి.కృష్ణ ఇటీవల మరణించారు. కాగా కానిస్టేబుల్ కుటుంబానికి రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కు మంజూరైంది. బుధవారం కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని తెలిపారు.