KMM: తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డి మందును క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించాలని లోక్ సభలో కోరారు. 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.